
ఆసక్తికరంగా ‘ఏవమ్ జగత్’ మూవీ ఫస్ట్ లుక్
‘వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా తీసుకొని ‘ఏవమ్ జగత్’ మూవీని తెరకెక్కించామని అన్నారు. దర్శకుడు దినేష్ నర్రా. ఆయన దర్శకత్వంలో కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏవం జగత్’. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొనిపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ మాట్లాడుతూ.. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం శివకుమార్, కెమెరా వెంకీ అల్ల.
Source:- https://www.sakshi.com/telugu-news/movies/aevum-jagat-movie-first-look-out-1384522